కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్ల పట్ల వివక్ష చూపుతో వారికి నిర్లక్ష్యం ఇస్తున్నారని ఆశా వర్కర్లు గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్ల మండల కార్యదర్శి కవిత, కోశాధికారి స్రవంతి కోశాధికారి స్రవంతి మాట్లాడుతూ ప్రభుత్వం ఆశ వర్కర్లకు వెట్టిచాకు చేయించుకొని పనికి తగిన వేదనాన్ని చెల్లించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ వర్కర్లకు నెలకు 18 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. దీంతోపాటు ప్రభుత్వం పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఆశలకు గౌరవేతనంతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఏశాల గంగాధర్ మండలంలోని ఆశ వర్కర్లు పాల్గొన్నారు.