నవతెలంగాణ – బంజారా హిల్స్
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని ఆశ ఆస్పత్రికి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చూయించడానికి వచ్చిన కారు యజమానికి నిరాశ మిగిలింది. చెట్టు కింద సేఫ్గా ఉంటుందని కార్ పార్కింగ్ చేసి తిరిగి వచ్చేసరికి భారీ వృక్షం కారుపై పడడంతో నిరాశ చెందిన వైద్యులు సిద్ధార్థ రెడ్డి ప్రతిరోజు ఆస్పత్రిలో రౌండ్స్ కు వచ్చి వెళ్తూ ఉంటారు. వచ్చిన ప్రతిసారి ఆస్పత్రి సెల్లార్లోనే పార్కింగ్ చేస్తారు. దురదృష్టం ఆయనను వెంబడించినట్టుంది. ఈ రోజే ఒక అరగంట కొరకు లోపల ఎందుకని చెట్టు కింద పెట్టడంతో ఆ భారీ వృక్షం ఆయన కారు పై పడటంతో ఉదయం నుండి సాయంత్రం వరకు కారు కొరకు వేచి ఉండే పరిస్థితి ఏర్పడింది. స్థానికంగా ఉన్న బంజారాహిల్స్ పోలీసులకు ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదు చేయగా పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించి ఇరువైపులా రోడ్లను మూసివేసి డీఆర్ఎఫ్ జీహెచ్ఎంసి వారికి సమాచారం అందించి భారీ క్రేన్ల సహకారంతో ఆ వృక్షాన్ని దాదాపు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం ఐదున్నర గంటల వరకు సహాయక చర్యలు చేపట్టి కారును విద్యుత్ స్తంభాలను రహదారి నుండి పక్కకు తీసి ప్రజలు ప్రయాణించే మార్గాన్ని సుఖమం చేశారు. ఒకపక్క ఏకతాటిగా కురుస్తున్న వర్షంలోని సహాయక చర్యలు విద్యుత్తు అంతరాయం ఆ సమయంలో ఆ రహదారిపై ప్రయాణిస్తున్న వారు ఎవరు విద్యుత్తుని ముట్టుకోకపోవడం అదృష్టం అనుకోవాలి భారీ స్తంభాలు మూడు నెలకొరకడంతో పాటు విద్యుత్ వైర్ తీగలు తెగి రహదారిపైనే పడిపోయాయి సకాలంలో పోలీసులు జిహెచ్ఎంసి విద్యుత్ అధికారులు టీఆర్ఎస్ టీం ప్రత్యేకంగా పనిచేయడం వలన పలువురి ప్రాణాలు కాపాడడం జరిగింది. ఈ ప్రాంతానికి స్థానిక కార్పొరేటర్ మన్నే కవితా రెడ్డిగా చేరుకొని సహాయక చర్యలు చేపట్టడానికి కావలసిన సహకారాలు స్థానికులు సైతం అందిస్తారని తెలియజేస్తూ ప్రజలు ఆ ప్రాంతంలో ప్రయాణించకుండా చూడాలని తెలిపారు ఎమ్మెల్సీ కవిత నివాసం కూడా ఆ ప్రాంతంలోనే ఉండడంతో ఆమె కూడా సహకారం అవసరమైతే తన సిబ్బందిని కూడా పంపిస్తానని తెలియజేయడంతో పనులు సత్వరం పూర్తి చేసుకోగలిగామని డిఆర్ఎఫ్ ప్రధాన అధికారి సర్దార్ అలీ ఖాన్ తెలిపారు.