– సీఐటీయూ రంగారెడ్డి జిల్లా
– ఉపాధ్యక్షులు బిస సాయిబాబు
– రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యాలయ
– ముట్టడిని అడ్డుకున్న పోలీసులు
– ఆశాలను అరెస్టు చేసి
– పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
నవతెలంగాణ-కొత్తూరు
జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశావర్కర్ల సమస్యల ను పరిష్కరించి వారిని ఆదుకోవాలని సీఐటీయూ రం గారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బిసా సాయిబాబు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశావర్కర్లు సోమవారం వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అడ్డుకొని పలువురు ఆశావర్కర్లతో పాటు సీఐటీయూ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోలీసులు ఎక్కడికక్కడ తమను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడం దారుణమన్నారు. ఆశాలకు హెల్త్ కార్డులను అందజేసి బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 16 నెలల బకాయి డబ్బు లను వెంటనే చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్ల జిల్లా సహాయ కార్యదర్శి కవిత, ఇందిరా, అనిత, మహేశ్వరి, శోభ, లక్ష్మి, మాధవి, సుగుణ, శ్రీ వాణీ, వసంత, లత, భాగ్య, సరిత, తదితరులు ఉన్నారు.