ఆశాజనకంగా ఆయిల్ ఫాం సాగు…

Hopefully oil farm cultivation...– పెరుగుతున్న గెలలు…
– నిలకడగా ధరలు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆయిల్ ఫాం గెలల ధర గత ఏడాది డిసెంబర్ కంటే ఈ ఏడాది జనవరి లో టన్నుకు రూ.19 తగ్గింది.2024 డిసెంబరులో నెలలో రూ.20,506 లు పలికిన గెలల ధర జనవరిలో రూ.20,487 లు పలికింది. టీజీ ఆయిల్ ఫెడ్ ఎండీ, ఉద్యానశాఖ కమిషనర్, మార్కెటింగ్ శాఖ  ఉన్నతాధికారి యాస్మిన్ బాషా  సమక్షంలో ఆయిల్  గెలల ధరను శనివారం నిర్ణయించారు. తగ్గిన గెలల ధర జనవరి నెలలో సేకరించిన గెలలకు వర్తిస్తుందని టీజీ ఆయిల్ ఫెడ్ జీఎం సుధాకర్ రెడ్డి తెలిపారు. అయితే ఈ ఏడాది ఆయిల్ ఇయర్ నవంబర్ ప్రారంభం నుండి గెలలు పెరుగుతూ అదే క్రమంలో ధరలు సైతం నిలకడగా ఉండటంతో ఆయిల్ ఫాం సాగు ఈ ఏడాది రైతుల్లో ఆశలు చిగురించే లా ఉన్నాయి. గత రెండేళ్ళ ఆయిల్ ఇయర్ ల కంటే ఈ ఏడాది ఆయిల్ ఇయర్ లో నవంబర్ నుండి గెలల దిగుబడి క్రమంగా పెరుగుతూ టన్ను గెలలు ధరలు రూ.20 వేలకు తగ్గకుండా ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్ ఇయర్ ప్రతీ ఏడాది నవంబర్ ఒకటో తేదీ నుండి వచ్చే ఏడాది అక్టోబర్ 31 వరకు ప్రమాణంగా పరిగనిస్తారు. అశ్వారావుపేట, అప్పారావు పేట ఆయిల్ ఫెడ్ పామాయిల్ పరిశ్రమల మేనేజర్ లు ఎం.నాగబాబు, జి.కళ్యాణ్ గౌడ్ లు తెలిపిన వివరాలు ప్రకారం ఈ ఏడాది ఆయిల్ ఇయర్ లోని గడిచిన మూడు నెలల ధరలు,గెలలు పై విశ్లేషణా వ్యాసం.
గెలలు ధర టన్ను కి వేలల్లో….
నెల           22 – 23        23 – 24            24 – 25
నవంబర్    13,741        12,525           20,413
డిసెంబర్    13,881         12,534          20,506
జనవరి      13,781          12,681         20,487
గెలలు దిగుబడి…
నెల           22 – 23        23 – 24            24 – 25
నవంబర్ 19600.607  17929.050       18521
డిసెంబర్   8835.490     8114.930        9759
జనవరి     6196.955     5435.015        7354