– రెవెన్యూ రికార్డులను పరిశీలించిన ‘ఐటీసీ’
నవతెలంగాణ – ములుగు
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్‌లోని బిల్ట్ పరిశ్రమ పునరుద్ధరణలో భాగంగా ఐటీసీ కంపెనీ(ఇండియన్ టొబాకో కంపెనీ) ప్రతినిధులు పరిశ్రమకు సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్‌ను పరిశీలించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ములుగు జిల్లాకు వచ్చిన ఐటీసీ కంపెనీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చాంబర్‌లో చర్చించారు. అనంతరం బిల్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పరిశ్రమకు సంబంధించిన వివరాలు, సర్వే నంబర్‌లు ఇతర అంశాలను ఐటీసీ కంపెనీ ప్రతినిధులకు కలెక్టర్ వివరించారు. ఈ పర్యటనలో ఐటీసీ బృందం ప్రతినిధులు ఫైనాన్స్ జీఎం అవినాష్ జౌరి, లీగల్ జీఎం అమిత్ కుమార్, డిప్యూటీ జీఎం డాక్టర్ ఉషారాణి, లీగల్ ఆకాష్ జైన్, కలెక్టరేట్ కార్యాలయ ఇన్‌చార్జి ఏవో ప్రసాద్ తదితరులు ఉన్నారు.