హోరా హోరీగా సాగిన క్రికెట్ మ్యాచ్..

Hora hori cricket match..– విజేతలకు ట్రోఫీ అందించిన మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి 
నవతెలంగాణ – పెద్దకోడప్ గల్
మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్  గత 12 రోజుల గా కొనసాగిన  టోర్నమెంట్లో వివిధ మండలాల  క్రికెట్ జట్లు పాల్గొనగా ఆదివారం నాడు ఫైనల్ మ్యాచ్ లో పెద్దకోడప్ గల్ వర్సెస్ బిచ్కుంద పాల్గొనగా మొదట బ్యాటింగ్ చేసిన పెద్ద కొడప్ గల్ మొత్తం 12 ఓవర్లకు107 పరుగులు చేయగా బిచ్కుంద జట్టు 60 పరుగులు మాత్రమే చేసింది.బిచ్కుంద జట్టు పై పెద్ద కొడప్ గల్ జట్టు 48 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.ఫైనల్ లో గెలిచిన జట్టుకు మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి ట్రోపి తో పాటు నగదు బహుమతిగా అందించారు.ఈ సందర్భంగా నిర్వాహకుల మాట్లాడుతూ మాజీ  ఎంపిపి ప్రతాప్ రెడ్డి సహకారంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించమని ఎంపీపీ ఇలాంటి సహకారం అందిస్తే మరెన్నో క్రీడలు నిర్వహిస్తామని తెలిపారు.  ముఖ్య అతిథిగా వచ్చిన ఎంపీపీ మాట్లాడుతూ మండల కేంద్రంలో గత 12 రోజుల నుండి సాగిన క్రికెట్ టోర్నమెంట్ ఎన్నో జట్లు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.దింతో నేడు ఇరు జట్లు ఫైనల్ లో తలపడగా గెలిచిన   జట్టుకు మొదటి   బహుమతి 25,555 రూపాయలు రెండవ బహుమతి 12,222 రూపాయలను అందించారు.క్రీడలో మంచి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ప్రోత్సహకన్నీ అందజేశారు.అనంతరం ఎంపీపీ  మరియు సొసైటీ ఛైర్మన్ కు శాలువలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ హన్మంత్ రెడ్డి,డీలర్ శ్రీనివాష్ రెడ్డి,హన్మంత్ రెడ్డి,కామెంటర్ బాలాజీ పాటిల్,సౌరబ్ ప్రతాప్ సింగ్, పండరీ,నవీన్,క్రాంతి కిరణ్,నిర్వాహకులు ప్రేమ సింగ్,రాందాస్, రవీందర్,బలరాం ,బాల్ సింగ్,తదితరులు పాల్గొన్నారు.