తాతలకాలం నుంచీ
మా పాతింట్లో గోడకు
వేలాడేసిన గడియారంలో లోలకం
ఉయ్యలూగినట్టు అటూ ఇటూ ఊగుతూ
టిక్కి టిక్కి మనేది
ఇప్పుడు గోడకు కొట్టిన
క్లాక్‌లో సెకండ్ల ముళ్ళు
బండి చక్రంలా
గుండ్రంగా తిరుగుతూ
చక్కర్లు కొడుతోంది
కొత్తగా ముంజేతికి కట్టిన
వాచీ లోనేమో
1 2 3 అంటూ అంకెలు
వెలుగుతూ ఆరుతూ వున్నాయి
దశాబ్దాలుగా
నా లోపల గుండేమో
లబ్ డబ్ అంటూ
కొట్టుకుంటూనే వుంది
అన్ని ఇసిరెలూ మారాయి
అన్ని విలువలూ మారాయి
నేనే ఇంకా గతి తప్పలేదు
మనసూ మారలేదు
హోషియారీ నేర్వలేదు
– వారాల ఆనంద్