హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి..

నవతెలంగాణ -డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పిడిఎస్ యూ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చీఫ్ వార్డెన్ మహేందర్ రెడ్డి కి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ పిడిఎస్ యూ ప్రధాన కార్యదర్శి జయంతి మాట్లాడుతూ యూనివర్సిటీకి మంజూరైన బాలికల హాస్టల్ నిర్మాణం త్వరగా ప్రారంభించాలని, గర్ల్స్ హాస్టల్ కు మరొక కేర్ టేకర్ ను నియమించాలని, హాస్టల్ లో విద్యార్థులకు స్టడీ టేబుల్స్, కుర్చీలు తీసుకురావాలని, వైఫై సౌకర్యం కల్పించాలని, నాణ్యమైన భోజనం అందించాలని,హాస్టల్ పరిసర ప్రాంతాలను శుభ్రపరచాలని వారిచ్చిన వినతి పత్రం లో కోరారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యూ ఉపాధ్యక్షుడు శివ సాయి, నాయకులు అక్షయ్, రవీందర్ పాల్గొన్నారు.