
నవతెలంగాణ -తాడ్వాయి
విద్యార్థులకు ఎప్పటికప్పుడే వేడివేడి పౌష్టికరమైన ఆహారం అందించాలని ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో అంకిత అన్నారు. మంగళవారం మండలంలోని ఊరటం, ప్రభుత్వ గిరిజన బాలికల ఉన్నత పాఠశాలను కస్మికంగా తనిఖీ చేశారు. ఆఫీస్ రూమ్, హాజరు రిజిస్టర్, పాటశాల గదులు, వసతి గృహాలు, వంటగది, డార్మెటరీ హాలు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు ఆట మైదానం పరిసరాలు పరిశీలించారు. వర్షాకాలం కాబట్టి వంటశాలను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులతో కలిసి టిఫిన్ మధ్యాహ్న భోజన సమయంలో అందించే ఆహార పదార్థాల యూనిఫాం, పాత్రలు, స్కూల్ బ్యాగులు శాలహార సరఫరా అంశాలపై అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో పంచుతున్న 4వ తరగతి ఉద్యోగుల అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. సందర్భంగా పిఓ మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం బలవర్ధకమైన ఆహారం అందించాలని సూచించారు. ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారని తెలిపారు. అనారోగ్యంగా ఉంటే కష్టపడి చదవలేరని తెలిపారు.