నవతెలంగాణ-కడెం
మండలంలోని కన్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న క్యాంపు గ్రామానికి చెందిన సంఘం మల్లేష్ ఇల్లు గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోయింది. ఇల్లు కూలిపోయిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. మల్లేష్‌ది నిరుపేద కుటుంబం కావడంతో ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు.