నవతెలంగాణ – రాయపోల్
రాయపోల్ మండలం సయ్యద్ నగర్ గ్రామంలో శనివారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి నిరుపేద కుటుంబానికి చెందిన సయ్యద్ యాకుబ్ బీ రేకుల ఇల్లు పాక్షికంగా కూలిపోయింది.నిరుపేద కుటుంబానికి చెందిన యాకుబ్ బీ పొట్టకూటికోసం కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటుంది. ఆమె భర్త సయ్యద్ ఆలీ పది సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాకు వలస వెళ్లి మృతి చెందడం జరిగింది. అప్పటి నుంచి వారి ముగ్గురు పిల్లలను సాదుకుంటూ కూలి పని చేసుకుంటూ బతుకుతున్నారు. గ్రామంలో నివాసం ఉండటానికి ఉన్న చిన్నపాటి రేకుల ఇల్లు కూడా అకాల వర్షానికి కూలిపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.ప్రభుత్వం వీరి కుటుంబాన్ని ఆదుకొన ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆ కుటుంబానికి భరోసాగా నిలవాలని గ్రామస్తులు కోరుతున్నారు.