విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో  ఇల్లు దగ్ధం

నవతెలంగాణ – భువనగిరి రూరల్
నందనం పరిధిలోని సింగిరెడ్డిగూడెం  ఆవాసంలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం అయిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు,  బాధితులు తెలిపిన వివరాల ప్రకారం  నందన గ్రామానికి చెందిన కడమంచి మల్లయ్య ఇంటిలో  కడమంచి కరుణాకర్ అనే వ్యక్తి ఆయన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. అతను పాత ఇనుప సమన్  వ్యాపారం చేస్తుండగా, అతని భార్య ఫ్యాన్సీ ఐటమ్స్ అనగా రోల్డ్ గోల్డ్ వస్తువులు అన్ని జీవనం కొనసాగించేది. మంగళవారం ఉదయం పనులు ముగించుకొని ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో ఇల్లు దగ్ధమైనట్లు తెలిపారు. ఈ ఇల్లు దగ్ధం సంఘటనలో సుమారు ఒక లక్ష ఇరవై వేల రూపాయల నగదు మంటలలో ఖాళీ బూడిద కాగా, నాలుగు లక్షలకు పైగా ఇంటి  సామాగ్రి, టీవీ ఫ్రిడ్జ్ లాంటి అనేక వస్తువులు దగ్ధమైనట్లు తెలిపారు. కాగా బాధిత   కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ గ్రామ మాజీ సర్పంచ్ కడమంచి ప్రభాకర్ ప్రభుత్వాన్ని కోరారు.