నవతెలంగాణ- శంకరపట్నం
మెట్టుపల్లి గ్రామానికి చెందిన తోట బసవయ్య అనే వ్యక్తి ఇల్లు మంగళవారం అందాద మూడు గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమైంది, బసవయ్య పొలంలో నాటు వేయడానికి వెళ్ళగా ఇంటి నుండి పొగలు రాగా చుట్టుప్రక్కల వాళ్ళు గమనించి బిందెలతో నీళ్లు పోసి మంటలను ఆర్పేసినారు.సమాచారం తెలుసుకున్న బసవయ్య ఇంటికి వచ్చేసరికి ఇల్లు మొత్తం దగ్ధం అవడం జరిగింది ఇటీవల వరి ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులు తన ఇంట్లో ఉండగా రూ. నగదు 1,50,000 రూపాయలతో పాటు టీవీ బట్టలు తదితర వస్తువులు సామాగ్రి దగ్ధమైంది మొత్తం ఆస్తి నష్టం సుమారు ఐదు లక్షల 50 వరకు నష్టం జరిగినట్టు బసవయ్య కన్నీరు మున్నేరుగా విలపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకొని నష్టపరియం చెల్లించాలని బసవయ్య, బసవయ్య విజ్ఞప్తి చేశారు.