విద్యుత్ షాక్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం

House fire with electric shock circuit– కుటుంబాన్ని పరామర్శించిన ములుగు జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరికొండ బలరాం
నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని ముద్దులగూడెం గ్రామానికి చెందిన పిట్టల నరసయ్య రేణుక దంపతుల ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఆదివారం పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉండడం వల్ల భారీగా అగ్నిప్రమాదం జరిగిందని తెలుపుతున్నారు. కాగా బాధ్యత కుటుంబాన్ని బిజెపి జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వం వెంటనే సాయం అందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని అందుకు అవసరమైన సహాయం అందిస్తామని అన్నారు. కుటుంబం ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం వెంటనే స్పందించి 25 లక్షల రూపాయల పరిహారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్  జిల్లా ఉపాధ్యక్షుడు ఏనుగు రవీందర్ రెడ్డి , జిల్లా కార్యదర్శి శీలమంతుల రవీంద్ర చారి  కిసాన్ మోర్చా నాయకులు జినుకల కృష్ణకర్ రావు , జిల్లా ప్రచార కార్యదర్శి రాద్రపు  సురేష్ ,  మండల అధ్యక్షుడు మద్దినేని తేజరాజు , జిల్లా నాయకులు జాడి వెంకట్ ,కొత్త సుధాకర్  సత్యనారాయణ ,బాత్ అధ్యక్షుడు కండ శ్రీను , గణేష్ తదితరులు పాల్గొన్నారు .