నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
షార్ట్ సర్క్యూట్ తో ఓ ఇల్లు దగ్ధమైన ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణంలోని మహాలక్ష్మివాడ కాలనీలో నివాసం ఉంటున్న అఖ్తర్ తమ బంధువుల ఇంటికి శాంతినగర్ వెళ్లారు. గురువారం ఉదయం అఖ్తర్ ఇంటి నుండి మంటలు రావడాన్ని గమనించిన ఇరుగుపొరుగువారు తాళం పగలగొట్టి మంటలు నీటిని పోసి మంటలను ఆర్పరు. అనంతరం యజమానికి సమాచారం ఇవ్వగా హుటాహుటిన ఆయన నివాసానికి చేరుకున్నాడు. లోపల వెళ్లి చూడగా కిచెన్, హాల్ దగ్ధం కాగ దాదాపు రూ.2 లక్షల వరకు నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు.