హౌస్ లిస్టింగ్ సర్వే పకడ్బందీగా చేపట్టాలి..

House listing survey should be carried out armed..– కలెక్టర్ సందీప్ కుమార్ ఝా..
– జిల్లా వ్యాప్తంగా మొదలైన సర్వే..
– పలు మండలాల్లో ఆకస్మికంగా తనిఖీ..
నవతెలంగాణ – వేములవాడ 
హౌస్ లిస్టింగ్ సర్వే పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే(సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మొదలుకాగా, బోయినపల్లి మండల కేంద్రములోని 11 వ వార్డు, అలాగే వేములవాడ అర్బన్ మండలం మారుపాక, వేములవాడ రూరల్ మండలం అచ్చన్నపల్లిలో చేపట్టిన సర్వేను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్యుమారేటర్ బ్లాక్ లోని ఐదు ఇండ్లను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. సర్వే కొనసాగుతున్న విధానంపై అధికారాలను ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే(సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)లో భాగంగా తేదీ 01.11.2024 నుండి 03.11.2024 వరకు హౌస్ లిస్టింగ్ సేకరిస్తారని వివరించారు.  ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు జయశీల, రాజీవ్ మల్హోత్రా, ఎంపీఓ శ్రీధర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.