మున్సిపల్ కార్మికులకు ఇండ్ల స్థలాలు కేటాయించి, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ డిమాండ్ చేశారు. ఈ విషయమై సోమవారం ఏఐటీయూసీ అనుబంధం మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మెరుగు చిరంజీవి మంతెన కాంతారావ్ ల ఆధ్వర్యంలో కలెక్టర్ రాజర్షి షా ను కలిసి వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ కార్మికులకు ఒక నెల పెండింగ్ వేతనం ఈ క్రిస్మస్ పండుగకు అందే విధంగా మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేయాలని అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో దాదాపుగా 350 మంది కార్మికులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. చుట్టుపక్కల గ్రామాలలో కార్మికులు ఉన్నారని వారు ప్రొద్దున పని నిమిత్తం నాలుగు గంటలకు పట్టణానికి చేరుకొని పనిచేయాల్సి ఉంటుందన్నారు. కావున వారు రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు వారికి వెంటనే ప్రభుత్వ భూమి కేటాయించి ఇంద్రమ్మ ఇళ్ళను కట్టించి ఇవ్వాలని వివరించారు. ప్రభుత్వ భూమి ఎక్కడైనా ఉంటే ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామినిచినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సురేష్, శాంతమ్మ నాగరాజు ఆనంద్, ఆనంద్, సతీష్, శంకర్, శ్రీను, అనిల్, రామ్, సునీల్ పాల్గొన్నారు.