అర్హులైన నిరుపేదలందరికి ఇండ్ల స్థలాలు, రుణాలు ఇవ్వాలి

– సీపీఐ(ఎం) నాయకుల డిమాండ్
నవ తెలంగాణ కంటేశ్వర్ : నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భూ పోరాటం మంగళవారం 6వ రోజు చేరుకోవడం జరిగింది.  ఈ సందర్భంగా 6 భూపోరాటాన్ని ఉద్దేశించి నగర కమిటీ సభ్యులు ధ్యానంగుల కృష్ణ మాట్లాడుతూ.. గత ఆరు రోజులుగా భూ పోరాటం కొనసాగుతున్న ఇప్పటివరకు అధికారులు వచ్చి నిరుపేదల సమస్యలు ఏంటో తెలుసుకునే పాపన పోలేదని విమర్శించారు. అదేవిధంగా నిజామాబాద్ నగరంలో అనేక సంవత్సరాల నుండి అద్దె ఇండ్లలో  నివసిస్తున్న నిరుపేదలందరూ భూ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే  భూ పోరాటానికి మద్దతుగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం గోవర్ధన్,  నగర కార్యవర్గ సభ్యులు  కటారి రాములు, బెజ్గం సుజాత,మహేష్  నగర కమిటీ నాయకులు నాల్వల నరసన్న,  బొప్పిడి. అనసుజమ్మ  ఐద్వా నాయకులు కే లావణ్య, పి కళావతి, డివైఎఫ్ఐ  ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు.