రా”జన్న “ఆలయంలో ఇంటి దొంగలు..!

– నిత్య అన్నదానం, ప్రసాదాల, సానిటేషన్ ,గోదాం, ఇంజనీరింగ్ ప్రధాన శాఖల్లో అవినీతి..
– నిద్ర వస్థలో దేవాదాయ శాఖ, విజిలెన్స్ ,ఆడిటింగ్..
– సరుకుల కొను “గోల్ మాల్”
– పదిమంది అధికారుల, ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు..
– అవినీతి ,అక్రమార్జన పై ఎన్ని వార్త కథనాలు వచ్చిన స్పందన నిల్..
– అవినీతి పై కొత్త కమిషనర్  స్పందిస్తారా..?
– ఎన్నికల సమయమని దాటవేస్తారా..?
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ “రా”జన్న ఆలయంలో అడుగడుగున అవినీతి.. పేదల దేవుడన్నంత మాట నిజమో..  దేవాలయంలో ఇక్కడ అవినీతి బహుముఖ రూపాల్లో వర్ధిల్లుతుంది అంత నిజం.. ఇందుగలడుఅందు లేడున్న చందంగా అవినీతి,అక్రమార్జన,నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లతో పదోన్నతులు ఇలా అనేకాంశాలలో ఇంటి దొంగలను ఈశ్వరుడేరుగాడు అన్న రీతిలో గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలన గడిలో బందీ అయ్యిందని, కొంతమంది అధికారులు గత పాలకుల దగ్గర అనిగి మనిగి గులాంగిరి చేస్తూ, ఒకరికొకరు సహకరించుకుంటూ బెనిఫిట్స్ పంచుకున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటోంది.. వేములవాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు స్థానికంగా లేకపోవడం కూడా ఒక కారణం..కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనైన రాజన్న దేవాలయంలో జరుగుతున్న అవినీతి,అక్రమార్జన ,బదిలీలు లేకుండా మర్రి ఊడల పాతుకుపోయిన  అధికారుల, ఉద్యోగులపై చర్యలు తీసుకుంటారా.. ?  స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, ప్రజల్లోనే ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యవుతున్న ఆది శ్రీనివాస్ దేవాలయంలో జరుగుతున్న అవినీతి ఆరోపణలు పై దృష్టి సారించి ముఖ్యమంత్రి ,మంత్రాలు,  దృష్టికి తీసుకుపోయి చర్యలు తీసుకునేలా చేస్తారు  వేచి చూడాల్సిందే..గత పాలకుల మాదిరిగా ఒకరికొకరు సహకరించుకుంటూ అవినీతికి, అక్రమార్జన  ప్రోత్సహిస్తారు..?  అవినీతిని అరికడతారు వేచి చూడాలి.. లేదా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని దాటావేస్తారు..?
ప్రధాన శాఖల్లో అవినీతి..
దక్షిణ కాశీగా,  హరిహర క్షేత్రంగా తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా విరాజిల్లుతున్న రాజన్న క్షేత్రంలో నిత్యన్నదానం, ప్రసాదాల తయారీ, వసతి గదిలో, సానిటేషన్, గోదాం నిర్వహణ, ఇంజనీరింగ్, కేశఖండనం, కోడెముక్కులు, ప్రసాదాల విక్రయాలు ఇలా ప్రధాన శాఖల్లో అవినీతి జరుగుతున్నట్లు ఎన్నోసార్లు అధికారుల, ఉద్యోగుల బాగోతం వివిధ పత్రిక కథనాల్లో ప్రచరితమయ్యాయి, ఫిర్యాదు చేస్తేనే విచారణకే పరిమితమయ్యాయి తప్ప ఎప్పుడు కూడా శాఖపరమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని విమర్శలు దేవాలయంలో గొప్ప మంటున్నాయి, విచారణ అధికారులుగా ఈ దేవాలయ అధికారులు వివరిస్తారు. రాజన్న దేవాలయ ఇన్చార్జ్ ఈవో లుగా రమాదేవి, జ్యోతిలు అధికార పాలనలో విధుల పట్ల కఠినంగా వ్యవహరించడం వలన వారిని బదిలీ చేయించిన ఘనాపాటీలు ఈ అధికారఉద్యోగులు. ఎండోమెంట్లో సహకరించే వారు ఉండడంతో ఈ క్షేత్రంలో ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా తయారైంది. దేవాలయంలో ప్రసాదాల తయారీ, నిత్యన్నదానం, సానిటేషన్, కేశఖండనం టికెట్ రీ సెల్లింగ్, లడ్డు పులిహోర ప్రసాద విక్రయాల్లో, గోదాంలో సరుకులు, పరికరాలు కొనుగోలో అనేక గోలుమాలు జరుగుతున్న దేవాదాయ- ధర్మదాయ శాఖ, రెవెన్యూ, తూనికల కొలతల, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఆడిటింగ్ శాఖల అధికారులు నిఘా, పర్యవేక్షణ పెట్టకపోవడం ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఎప్పుడో అప్పుడు ఏదైనా పత్రికల్లో కథనాలు వస్తే విసిటింగ్ చేసి తనిఖీ చేసినట్లుగా హడావిడి చేసి వారికి రావాల్సిన బక్షిష్, మామూలు రాగానే మరుసటి రోజు  మర్చిపోతారని విమర్శలు ఉన్నాయి.
నిద్ర వస్థలో దేవాదాయ శాఖ, విజిలెన్స్, ఆడిటింగ్..
ప్రతి ఏటా 150 కోట్ల ఆదాయం రాజన్న ఖజానాకు జమ అవుతున్న క్షేత్రంలో హుండీ కానుకలు లెక్కింపులో వచ్చిన ఆదాయాన్ని బ్యాంకుల్లో జమ చేసే నిబంధనలు పాటించడం లేదని, కాంట్రాక్ట్ ఉద్యోగాల జీతాల చెల్లింపులో దేవాలయం నుండి రావాల్సిన బెనిఫిట్స్ సదర్ కాంట్రాక్టర్ ప్రతినెల సుమారుగా 10 లక్షల నుండి 15 లక్షల వరకు  భోంచేస్తున్నట్లుగా, అవకతవకలు జరుగుతున్నట్లుగా ఆరోపణలు కార్మికుల నుండి వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ కు లాభం చేకూరేలా దేవాలయ అధికారులు కార్మికుల జీతాలు చెల్లింపులో ఆడిటింగ్ సరిగ్గా నిర్వహించడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. శానిటేషన్, ఇంజనీరింగ్, నిత్యవసర సరుకులు ప్రసాదాల తయారీకి వినియోగించే కాజు, కిస్మిస్ ఇతర సరుకులు సెకండ్ క్వాలిటీ సరుకులను కొనుగోలు చేసి కాంట్రాక్టర్ తో చేతులు కలిపి రాజన్న ఖజానాకు గండి కొడుతున్నట్లుగా, అధికారుల ఉద్యోగుల అనేక కోణాల్లో దోచేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఆడిటింగ్, విజిలెన్స్, తూనికల -కొలతల, దేవాదాయ ధర్మాదాయ శాఖలఅధికారులు  వస్తున్నట్లుగా ముందుగానే ఇన్ఫర్మేషన్ చేరవేస్తారు, నిఘా,  వ్యవస్థ పటిష్టంగా లేదని విమర్శలు ఉన్నాయి.
కొత్త కమిషనర్  స్పందిస్తారా..?
రాజన్న క్షేత్రంలో జరుగుతున్న అవినీతి ,అక్రమార్జన బహుముఖ రూపాల్లో రాజన్నకే మహిమలు చూపిస్తున్న అధికారులు ఉద్యోగుల పై నవతెలంగాణ దినపత్రికలో ప్రత్యేక కథనాలు 11-12-2023న రాజన్న ఆలయంలో నకి “లీలలు”,16-12-2023 న మరోసారి,22-12-2023 న రాజన్న కోడెలు భద్రమేనా..!,24-12-2023 న రాజన్న ఇదేందయ్యా..?25-01-2024 న వేలం రద్దు వెనకాల రహస్యం ఏంది..?, 25-02-2024 న బీరువాలో దాచిన రహస్యం అనే కథనాలను ప్రచురించింది.. అది కాకుండా దేవాలయంలో జరుగుతున్న అవినీతి పై 2021 లో  ఫిర్యాదులు చేయడంతో  జరిగిన అవినీతి అక్రమాలపై 20-09-2023 రోజున రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ రామకృష్ణ విచారణ చేపట్టారు. దేవాలయంలో ముఖ్య శాఖలు అయిన కళ్యాణకట్ట, లడ్డు తయారీ, గోదాం నిర్వహణ, సానిటేషన్, ఇంజనీరింగ్, ఇతర ముఖ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న, కొంతమంది అధికారులైన ఏ ఈ ఓ లు హరికిషన్, జయకుమారి, శ్రీనివాస్ సూపర్డెంట్ లైన తిరుపతిరావు, రాజశేఖర్, హరిహరన్, శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్లు అయినా శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్లు, తిరుపతి, కే శ్రీనివాస్ లపై ఇంక మరికొందరిపై  వారి శాఖలపై, వారి విధులపై విచారణ చేపట్టారు. ఇంక మరికొందరిపై ఫిర్యాదు రావడం తో విచారణ నిర్వహించారు కానీ నేటి వరకు వారిపై శాఖా పరమైన, క్రమశిక్షణ చర్యలు  శూన్యం.. ముఖ్యంగా దేవాలయంలో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లతో ఏఈఓ స్థాయిలో, ఇంజనీరింగ్ శాఖలో పదోన్నతులు కొంతమంది అధికారులు కొనసాగుతున్నారు.  అవినీతి లో అధికారులు ఉద్యోగుల గణాపాటి చరిత్ర ఉన్న అవినీతికి పాల్పడుతున్న వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం ,దేవాదాయ శాఖ మంత్రి, ఈ మధ్యనే కొత్తగా వచ్చిన కమిషనర్ హనుమంతరావు ఆయన చర్యలు తీసుకుంటారు, ఎప్పటి మాదిరిగానే చూస్తూ ఉండిపోతారు వేచి చూడాల్సిందే.