
ఇంటి పన్నులు సకాలంలో చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని మండలంలోని అంతంపల్లి గ్రామ సర్పంచ్ మధు మోహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ 100% ఇంటి పన్నులు చెల్లించాలని, గ్రామ సమస్యలు ఏమైనా ఉంటే గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలియజేయాలని, గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మంజుల సంజీవరెడ్డి, కార్యదర్శి స్నేహ, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.