
– ప్రత్యేక చర్యలు చేపట్టిన అధికారులు
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
రెండు రోజులే కురుస్తున్న భారీ వర్షాలతో హుస్నాబాద్ మండలంలోని పలు గ్రామాలలో 13 ఇండ్లు కూలయి. మండలంలోని పొతరం ఎస్ లో 2 , మహ్మదాపూర్ లో 2, జిల్లాలగడ్డ లో 1,కు కుచనపల్లి లో 1,రాములపల్లిలో 1,తోటపల్లి లో 6 ఇండ్ల రేకులు గోడలు నేలమట్టమయ్యాయి. దీంతో బాధితులు దమ్ము ఉంటున్న ఇండ్లు భారీ వర్షాలతో కూలిపోయాయని ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుకుంటున్నారు. గ్రామాలలో భారీ వర్షాలతో కూలిన ఇండ్ల వివరాలను సేకరించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నట్లు ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. మండలంలో 13 ఇండ్లు పక్షికంగా కూలినట్లు ఎంపీడీవో పేర్కొన్నారు. గ్రామాలలో రెండు రోజులు కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బంది పకుండా అధికారులు ప్రత్యేక చర్యలు పెట్టారు. కూలీన ఇండల్లో ఉండకుండా మరోచోట ఉండేలా చర్యలు తీసుకున్నారు. బాధితులకు కావలసిన ఏర్పాట్లను పర్యవేక్షించినట్లు ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.