మండలంలోని చింతాగూడ గ్రామపంచాయతీ పరిధిలోని పాపమ్మ కూడా గ్రామంలో ఉన్న సర్వే నెంబర్ 81/ 1
ప్రభుత్వ భూమిలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంత జన్నారం మండల కార్యదర్శి పురం శెట్టి బాపు అన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలు ఎంతోమంది ఉన్నారని వారికి అధికారులు స్పందించి సర్వేనెంబర్ 81 బై ఒకటి లో ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు. సందర్భంగా బుధవారం ఆ భూమిలో టెంట్లు వేసి ప్లాకార్ట్స్ పట్టుకొని నిరసన తెలిపారు. పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చేంతవరకు సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజా పంట ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటామన్నారు. కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు జిల్లా కార్యదర్శి రమాదేవి, పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు సికందర్, చింతగూడ గ్రామస్తులు కోడేటి మల్లేష్ సామల పోసవ్వ శ్యామల శ్రీమతి రజిత చంద్రయ్య మధుకర్ రవి లతోపాటు వందలాది మంది మహిళలు పాల్గొన్నారు.