– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్ దేశా నాయక్
నవతెలంగాణ అచ్చంపేట: పట్టణంలోని 213 సర్వే నెంబర్ లో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్ దేశం నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం పట్టాలు ఉన్న లబ్ధిదారులు 213 సర్వే నెంబర్ లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశనాయక్ మాట్లాడుతూ 2011లో పేదలకు ఇండ్ల స్థలాలను కేటాయిస్తూ లబ్ధిదారులకు రెవెన్యూ అధికారులు పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు ఉన్న లబ్ధిదారులకు సమాచారం ఇవ్వకుండా అధికార అహంకారంతో, అప్పటి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కెసిఆర్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలలో డబుల్ బెడ్ రూమ్ లు నిర్మాణం చేసింది. డబుల్ బెడ్ రూమ్ లు పేదలకు కేటాయించడంలో అధికారులు పాలకులు, వ్యత్యాసం చూపించాలని మండిపడ్డారు.
నిజమైన అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని అన్నారు. ఇంకా 500 ప్లాట్లు మిగిలి ఉన్నాయి. పట్టాలు ఉన్న లబ్ధిదారులకు ఇళ్ల సలాలు కేటాయించాలని వారి డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాను గెలిచిన వెంటనే పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తామని, ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ హామీ ఇచ్చారు. పేద ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని సీపీఐ(ఎం) నాయకులు డిమాండ్ చేశారు. పేదల ఇళ స్థలాల పైన అధికారులు పాలకులు, రాజకీయం చేయడం తగదన్నారు. సీపీఐ(ఎం) నిరంతరం ప్రజల తరఫున ప్రజా ఉద్యమాలు చేయడం జరుగుతుందని, పేదల ఇళ్ల స్థలాల కోసం పోరాటాలు చేస్తే పోలీసులు కేస నమోదు చేసి జైలుకు పంపించాలని గుర్తు చేశారు. సర్వేనెంబర్ 236 , 237ల లో సీపీఐ(ఎం) అలుపెరుగని పోరాటాలు చేయడం వల్ల అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 1142 మందికి ఇళ్లస్థలాలు పట్టాలు ఇచ్చిందని, ఆ స్థలాలలో పేదలు ఇల్లు నిర్మించుకొని సంతోషంగా నివాసం గడుపుతున్నారని గుర్తు చేశారు. భవిష్యత్తు కాలంలో పేదల ఇళ్ల స్థలాల కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఎస్. మల్లేష్,