– పేదలతో కలిసి, కలెక్టర్ కు వినతి పత్రం అందజేత
నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటా పూర్ గ్రామంలోని పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. అని ఇండ్ల స్థలాలను వారికి కేటాయించలేదు.
కాటాపూర్ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు వెంటనే ఇంటి స్థలాలను అప్పగించాలని, ములుగు జడ్పీ మాజీ చైర్ పర్సన్, బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు. సోమవారం ‘కా టా పూ ర్’ గ్రామానికి చెందిన ఇళ్ల లబ్ధిదారులతో కలిసి బడే నాగజ్యోతి, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడుతూ మండలంలోని కాటాపూర్ గ్రామంలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు 2023 సంవత్సరంలో పుట్ట 47 సర్వేనెంబర్ గల భూమిలో వారికి ఒక్కొక్కరికి 75 గజాల చొప్పున, 108 మందికి ఇంటి స్థలాలను మంజూరు చేశారని అన్నారు. లబ్ధిదారులకు అప్పగించే సమయంలో ఎన్నికలు రావడంతో ఇళ్ల స్థలాలను అప్పగించడంలో జాప్యం జరిగిందన్నారు. మండల రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో నేటికీ లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను అందుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా పాలన అధికారైన కలెక్టర్ గారు లబ్ధిదారులకు వెంటనే ఇళ్ల స్థలాలను అప్పగించాలని వారు కోరారు. కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ 15 రోజుల్లోగా సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సభ్యులు రామసహాయం శ్రీనివాస్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్, మాజీ సర్పంచులు పులి పెద్ద నర్సయ్య గౌడ్, పుల్లూరి గౌరమ్మ, మాజీ ఎంపీటీసీ దానక నర్సింగరావు, పిఏసీఎస్ వైస్ చైర్మన్ ఇందారపు లాలయ్య, నాయకులు సయ్యద్ హుస్సేన్, సాయిరి లక్ష్మీనర్సయ్య, లంజపెల్లి రాంబాబు, పుల్లూరి రమ తో పాటు 50 మంది లబ్ధిదారులు పాల్గొన్నారు.