వరద బీభత్సం నీట మునిగిన ఇండ్లు

వరద బీభత్సం
వరద బీభత్సం

నవతెలంగాణ-గోవిందరావుపేట
కొట్టుకుపోయి చనిపోయిన మూగ జీవాలు మూడు చోట్ల 163 వ జాతీయ రహదారి వరద బీభత్సం గోవిందరావుపేట మండలం అతలాకుతలం చేసింది. మండల చరిత్రలో ఎన్నడూ రానింత వరద బీభత్సం బుధవారం రాత్రి నెలకొంది. పసరలో 163వ జాతీయ రహదారి తేజ రాజు ఇంటి ప్రాంతంలో కోతకు గురై రాకపోకలు లేకుండా చేసింది. పసర గ్రామ పొలిమేరలు గుండ్ల వాగు బ్రిడ్జి రెండు వైపులా కోతకు గురైంది. పలువురి మూగజీవాలు కొట్టుకుపోగా కొన్ని జీవాలు మృతి చెందాయి. వందలాధి ఎగరాల్లో ఇసుక మేటలు వేసింది. వేసిన నాట్లు కొట్టుకుపోయాయి.  పసరలో ఎస్సీ కాలనీ అభ్యుదయ కాలనీలో నీరు చేరడంతో పాఠశాలలో పునరావసకేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. రంగాపురం, రాఘవపట్నం, ప్రాజెక్ట్ నగర్, ఫ్రూట్ ఫారం, సోమల గడ్డ, ముత్త పురం, మొట్ల గూడెం, టప మంచే, నేతాజీ నగర్, అమృతండా, గ్రామాలకు మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. రాకపోకలు నిలిచిపోయాయి. మరదలా పరిస్థితి తాహసిల్దార్ అల్లం రాజకుమార్ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.