
ఇందల్ వాయి మండలంలోని కోత్త కోరుట్ల తండా గ్రామ పంచాయతీలో భూక్య భగవాన్ కు చెందిన నివాస గృహం గురువారం సాయంత్రం నేలా మట్టమయిందని బాదితులు తెలిపారు.గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోడ పూర్తిగా నానడంతో ప్రమాదం జరిగినట్లు తండా వాసులు తెలిపారు. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని, ఇంట్లో ఉన్న వస్తువులు పాడైనట్లు తెలిపారు. ప్రభుత్వం భగవన్ కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటు న్నారు. ప్రభూత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.