పేదలకు నివాస స్థలం,గృహం మంజూరీ చేయాలి: ప్రజా సంఘాల పోరాట వేదిక

నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ 125 గజాల ఇంటి స్థలం మంజూరు చేయాలని,నివాస గృహం లేని వారందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డి.టి సుచిత్ర అందించారు.  ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పదిలక్షలు,రాష్ట్ర ప్రభుత్వం ఐదున్నర లక్షలు ఆర్థిక సాయం చేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి.చిరంజీవి, తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షులు జగన్నాధం, వెంకటేశ్వర్లు కృష్ణవేణి, మురళి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.