జీతాలు ఇవ్వకుంటే బతికేది ఎట్లా..

నవతెలంగాణ – చింతలమానపల్లి
‘ఏడు నెలలుగా మాకు జీతాలిస్త లేరు. ఊర్లో కిరాణా దుకాణాల్లో కనీసం ఉప్పు, పప్పు కూడా ఉద్దెర ఇవ్వని పరిస్థితి వచ్చింది. ఇట్లైతే మేము బతికేది ఎట్లా’ అంటూ చింతల మానేపల్లి మండలం గంగాపూర్ పంచాయతీ ఎదుట మల్టీపర్పస్ వర్కర్లు ధర్నా చేశారు.