– శ్వేతా పత్రం విడుదల చేయాలి
– సర్పంచ్ల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షులు మాట్ల మధు
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
కరీంనగర్ ఎంపీ నియోజకవర్గానికి ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని నిధులను తీసుకువచ్చారు శ్వేతా పత్రం విడుదల చేయాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ని సర్పంచ్ల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షులు మాట్ల మధు ప్రశ్నించారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ..నిన్నటి రోజు ప్రజాహిత యాత్రలో పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ మాజీ సీఎం కేసిఆర్,ఎమ్మెల్యే కేటీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ఎంపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు సిరిసిల్ల నియోజకవర్గానికి ఎన్ని నిధులు మంజూరు చేశారో శ్వేతా పత్రం విడుదల చేయాలన్నారు. లేదంటే బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులపై శ్వేత పత్రం విడుదల చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వము ఉన్న గ్రామ పంచాయతీలకు విడుదల చేయాల్సిన పంచాయతీరాజ్ చట్టప్రకారమే నిధులు మంజూరు చేశారే తప్ప కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఏమి కేటాయించలేదని గుర్తు చేశారు. ఇకనుంచి టిఆర్ఎస్ పార్టీ నాయకుల పై,ప్రజాప్రతినిధులపై బిజెపి నాయకులు అవాక్కులు, చేవాక్కులు చేస్తే సహించేది లేదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ డైరెక్టర్ బండి దేవదాస్, మాజీ సర్పంచ్ రమేష్, యూత్ సీనియర్ నాయకుడు చిరంజీవి, చంటి, సిద్ధన్న, శ్రీనివాస్, అమరేందర్ రావు పాల్గోన్నారు.