రాజకీయ పరిణామాలను ఎలా పరిశీలించాలి?

ఇది చాలా చిన్న పుస్తకం. అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన మార్క్సిస్టు మేధావి ప్రొఫెసర్‌. ఐజాజ్‌ అహ్మద్‌ తన సహజశైలిలో రాసిన రెండు సుదీర్ఘ వ్యాసాలు. పలు వర్తమాన అంశాలపై ఆయనతో జిప్సన్‌ జాన్‌, జితీష్‌, పి.ఎం. లు జరిపిన ఇంటర్యూ వున్నాయి. నేడు భారత దేశంలో హిందూత్వ మతోన్మాదం ఎంత ప్రమాదకరంగా మారి నెత్తినెక్కి కూర్చుందో మనందరం ప్రత్యక్షంగా చూస్తూనే వున్నాం. ఇలాంటి అతి ముఖ్యమైన పరిమాణాన్ని ఐజాజ్‌ అహ్మద్‌ క్లుప్తంగా అత్యంత ప్రతిభావంతంగా వివరిస్తారు. అంతేకాదు, ఇలాంటి అతి మితవాద ధోరణులు ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాపితంగా పలు దేశాల్లో గమనిస్తామని, దీనికి అంతర్జాతీయ నేపధ్యం సోవియట్‌ యూనియన్‌, ఇతర కమ్యూనిష్టు దేశాల పతనం ద్వారా సమకూరిందని చెబుతారు. ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయడం ద్వారా సమకాలీన రాజకీయాలను అర్ధం చేసుకోవడమే కాకుండా, అసలు రాజకీయ పరిణామాలను ఎలా పరిశీలించాలో కూడా పాఠకులు తెలుసుకుంటారు.
– ప్రచురణ కర్తలు
భారతదేశం
ఉదార ప్రజాస్వామ్యం తీవ్ర మితవాదం
రచయిత : ఐజాక్‌ అహ్మద్‌
పేజీలు : 96, వెల : రూ. 90/-
ప్రతులకు : నవతెలంగాణ అన్ని పుస్తక కేంద్రాలు