ప్రతి ఇంటి వంటగదిలో తప్పకుండా ఉండే వస్తువు కారం. ఈ కారం లేకపోతే ఏ వంటకమూ రుచికరంగా ఉండదు. అసలు తినలేం కూడా. నేడు మార్కెట్‌లో కల్తీ కారం విపరీతంగా అమ్మేస్తున్నారు.. రుచిని పక్కన పెడితే మన ఆరోగ్యానికి ఇవి హాని చేస్తాయి.
మార్కెట్‌లో ఉండే నకిలీ కారాన్ని ఎలా గుర్తించాలో చూద్దాం.
కారంలో ఎర్ర ఇటుక, ఎర్ర ఇసుక, కొన్ని రకాల చెక్కల పొడి, స్టార్చ్, సబ్బుపొడి కలుపుతున్నారు. ఇవి అచ్చం కారం రంగులోనే ఉంటాయి. దీంతో పాటు కారం పూర్తిగా ఎర్రగా నిగనిగలాడే రంగులో కనిపించడానికి కొని కత్రిమ రంగులను కూడా కలుపుతున్నారు. ఇవి కారం ఎర్రగా, అద్భుతమైనదిగా కనిపిస్తుంటుంది.
నకిలీ కారాన్ని గుర్తించాలనుకుంటే.. ఒక గ్లాసులో నీరు పోసి, అందులో మార్కెట్ నుంచి తెచ్చిన కారాన్ని కలపండి. అది పూర్తిగా నీళ్లలో కరిగిపోతే అది ఒరిజినల్‌గా నిర్థారించుకోవచ్చు. ఒకవేళ అది నీటిలో కరగకపోతే.. అది నకిలీదని అర్థం.
అందులో కలిపిన బియ్యం పొట్టు, ఇటుక, మరేదైనా నకిలీవి ఉంటే అవి నీటిలో కరగవు.
అలాగే ఒక ప్లేట్‌లో కారం వేసి, ఆపై ఉప్పునీరు లేదా అయోడిన్ చుక్కలను చల్లండి. అపుడు కారం నీలం రంగులోకి మారితే, అది నకిలీదని అర్థం. అలాగే ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుని అందులో ఉప్పు పొడి వేసి కలపాలి. తర్వాత ఆ నీటిని చేతులకు రుద్దినపుడు నురగ వస్తే అందులో సబ్బుపొడి కలిపినట్లు అర్ధం చేసుకోవాలి. ఈ విధంగా మార్కెట్‌లో దొరికే నకిలీ పౌడర్లను గుర్తించొచ్చు.