ఏకాగ్రతని మెరుగుపరచడం ఎలా?

How to stay focused?ఏకాగ్రత ఉంటేనే దేనినయినా నేర్చుకోగలం. ఎక్కువ కాలం గుర్తుంచుకోగలం. ఏకాగ్రత చిన్నప్పటి నుండి ప్రతి విద్యార్థికి ఉండవల్సిన అలవాటు. అయితే ఏకాగ్రతను ఏ దశలోనైనా పెంపొందించుకోవచ్చు. నేర్చుకోదలచిన విషయంపై ఆసక్తిని పెంచుకుంటే అది తనంతట తానుగా అభివద్ధి చెందుతుంది.
ఏకాగ్రత అంటే మీ మానసిక శక్తులు లేదా ప్రయత్నాలను ఒక నిర్దిష్ట కార్యాచరణ, విషయం లేదా సమస్య వైపు మళ్లించడం. ఏకాగ్రత మెరుగుపరచడానికి కొన్ని నిర్దిష్ట నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. వీటిని అభ్యసించడం విద్యార్థి దశలో విజయాన్ని మెరుగుపరుస్తుంది.
ఏదైనా విషయం ఒక్కసారి మెదడులో నిక్షిప్తమైతే దాన్ని ఎప్పటికీ మరచిపోలేం. కాకపోతే ఆ సమాచారాన్ని గుర్తుచేసుకోవడం (రీకాల్‌)లో ఇబ్బంది ఉండవచ్చు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచుకోడానికి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి.
ఏకాగ్రత బేసిక్స్‌
ఏకాగ్రతను మెరుగుపరకోడానికి రెండు పద్ధతులున్నాయి. అవి… అధ్యయన వాతావరణం, అధ్యయన సెషన్‌ల నిర్మాణం. వాటిని ఎంత ఎక్కువగా అమలు చేస్తే అంత ఎక్కువగా ఏకాగ్రత సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు.
అధ్యయనం పర్యావరణ విశ్లేషణ
చదువుకోడానికి అనువుగా ఉండే ప్రదేశాలను గుర్తించాలి. ఆ ప్రదేశాలల్లో కూర్చుని ప్రశాంతంగా చదుకునేలా వుండాలి.
స్నేహితులతో మాట్లాడటం, కంప్యూటర్‌ గేమ్‌లు ఆడటం, టీవీ చూడటం వంటి పరధ్యానాల వల్ల ఎక్కువ సమయం వధా అవుతుంది. మీరు చివరిగా ఏకాగ్రతతో చదివిన సమయం ఏదో గుర్తుచేసుకోండి. చదువుకోవడానికి ఎంత సమయం కేటాయించారు? కేటాయించిన సమయంలో ఎంత టైం చదువు సాగింది? ఈ రెండు ప్రశ్నలకు మీ సమాధానంలో ఎక్కువ టైం తేడా ఉన్నట్లయితే, మీరు చదువుకోడానికి ఎన్నుకున్న ప్రదేశాన్ని తక్షణం మార్చాల్సిందే!
పరధ్యానానికి కారణం వ్యక్తిగత ఆందోళనలు కావచ్చు. వాటిని నియంత్రించడం చాలా కష్టం. ఈ కారణమే మీ అధ్యయనానికి ఆటంకం అని గుర్తిస్తే, వెంటనే ఆ ఆందోళన తగ్గించుకోడానికి మార్గం చూడండి. అవసరమైతే కౌన్సినింగ్‌ తీసుకోవచ్చు.
అనుకూలమైన పరిస్థితులు
చదువుకోవడానికి ఉపయోగించే కుర్చీ 45 నిముషాల పాటు కదలకుండా కూర్చునేంత సౌకర్యంగా ఉండాలి. సదువుకు సంబంధించిన మెటీరియల్స్‌ మొత్తం పెట్టుకోడానికి తగినంత స్థలంలో కూర్చోవడం ముఖ్యం. గదిలోని లైటింగ్‌ కంటికి ఇబ్బంది కలిగించకూడదు. ఉష్ణోగ్రత సౌకర్యవంతంగా చల్లగా ఉండాలి.
సరైన అంచనా
తక్కువ సమయంలో ఎక్కువ చదివేయాలనుకోవడం నిరుత్సాహానికి దారితీస్తుంది. ఒక సబ్జెక్ట్‌ చదవడానికి ఎంత టైం పడుతుందో సరిగా అంచనా వేయలేకపోతే ఒత్తిడికి గురికావాల్సి వస్తుంది.
సాధారణంగా కష్టమైన లేదా బోరింగ్‌ సబ్జెక్ట్‌లతో ప్రారంభించడం ఉత్తమం. చదవడం ప్రారంభించినప్పుడు మీ ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. తెల్లవారుజామున చదవడం స్టార్ట్‌ చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ చదవగలుగుతారు.
హుమతిని ప్లాన్‌ చేయండి
స్టడీ ప్లానింగ్‌లో మీరు చదవాల్సిన సబ్జెక్ట్‌ మొత్తం పూర్తయ్యాకనే మిగతా పనులకు సమయం కేటాయించాలి. అంటే ఇష్టమైన ఆటలు ఆడటం, టీవీ షోలు చూడటం, ఫ్రెండ్స్‌తో మాట్లాడటం, సినిమాకు వెళ్లటం… వంటివి.
ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచుకోవడమెలాగో నేర్చుకోవడానికి అద్భుత మనో వైజ్ఞానిక గ్రంథమే ప్రముఖ స్టేజ్‌ హిప్నాటిస్ట్‌, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌, ఎన్‌.ఎల్‌.పి. మాస్టర్‌ ట్రైనర్‌, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు డా|| హిప్నో కమలాకర్‌ రచించిన ఈ ‘ఏకాగ్రత – జ్ఞాపకశక్తి’ పుస్తకం. ఈ పుస్తకాన్ని ఒక్కసారి చదవండి. మార్పు మీకే తెలుస్తుంది!!
డా|| హిప్నో పద్మా కమలాకర్‌
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌,
హిప్నో థెరపిస్ట్‌