– పూర్తిగా పాడైన వరంగల్ ఖమ్మం 563 రోడ్డు.. ప్రయాణికులకు ఇబ్బందులు
నవతెలంగాణ- దంతాలపల్లి
జాతీయ రహదారిపై ప్రయాణం అంటే ఎవరైనా హ్యాపీగా వెళ్లొచ్చని అనుకుంటారు.మండల పరిధిలోని వరంగల్ ఖమ్మం 563 రాష్ట్ర రహదారి అంటే మాత్రం అందరూ భయపడుతున్నారు. అక్కడక్కడ ఉన్న గుంతలపై ప్రయాణం చేయడానికి భయపడుతున్నారు. ప్రమాదకరంగా మారిన చోట ఇంజనీరింగ్ అధికారులు కనీసం డాంబర్ తో ప్యాచ్ వర్క్ చెయ్యకపోవడంతో పలుమార్లు యాక్సిడెంట్లు జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న తీరుపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని బొడ్లాడా స్టేజి నుంచి ఎంపీడీవో కార్యాలయం సమీపంలో, పోలీస్ స్టేషన్ ముందు, తహసిల్దార్ కార్యాలయం సమీపంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా రోడ్డుపై నిలుస్తున్న వాహనాలు, ఇలా నర్సింహులపేట మండలం సరిహద్దు వరకు సుమారు 9 కిలోమీటర్లు వరకు జాతీయ రహదారి, ఆయా రోడ్లపై జనవరి 2024 నుంచి ఇప్పటివరకు రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్లకి గురై 08 మంది మృతి చెందగా, ఆరు కేసులు నమోదయ్యాయి. ఇలా పలుమార్లు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణమే రోడ్డు మరమాతలు చేపట్టి ప్రమాదలను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. పలుమార్లు వరంగల్, ఖమ్మం 563 రాష్ట్ర రహదారిపై ప్రమాదాల జరుగుతున్న ఆర్ అండ్ బి అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని,, మార్త శ్రీనివాస్ అన్నారు. ఈ ప్రమాదలు జరుగుతున్నట్లు నవ తెలంగాణ దినపత్రికలో పలు వార్తలు వచ్చిన విషయాన్ని రోడ్డు రవాణా శాఖ అధికారులు పట్టించుకున్నట్లయితే శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు, జరిగేవి కావానీ, అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని, ఇప్పటికైనా అధికారులు అక్కడక్కడ రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న గుంతలను పూడ్చి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి.
కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్త శ్రీనివాస్.