ఐఎంటిలో హెచ్‌ఆర్‌ లీడర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌

ఐఎంటిలో హెచ్‌ఆర్‌ లీడర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌హైదరాబాద్‌ : ఐఎంటి హైదరాబాద్‌లో హెచ్‌ఆర్‌ లీడర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌-2024ను నిర్వహించారు.ఆ సంస్థహ్యూమన్‌ రిసోర్స్‌ క్లబ్‌ సినర్జీ కీలక పాత్ర పోశించిన ఈ సదస్సును ‘ఎంపవరింగ్‌ ఫ్యూచర్‌ వర్క్‌ఫోర్స్‌: స్ట్రాటజీస్‌ ఫర్‌ ఇన్‌క్లూజివ్‌ లీడర్‌షిప్‌’ నేపథ్యంతో ఏర్పాటు చేశారు. దీనికి ప్రొఫెసర్లు ఉమారావు గండూరి, వెంకట చక్రపాణి, తుంప డే, రోమీనా మాథ్యూ, మాళవిక జోషి హాజరై ప్రసగించారు. సంస్థల్లో మానవ వనరుల నిర్వహణ, నాయకత్వంపై చర్చించారు.