జుక్కల్ మండలం హంగర్గ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో శనివారం నాడు చేరారు. గ్రామ కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గారు వీరందరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా రంజక పాలన మరియు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న తీరు పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ మాట్లాడుతూ. గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే జుక్కల్ నియోజకవర్గం వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పదిహేనేళ్ళు ఎమ్మెల్యేగా వెలగబెట్టిన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే నియోజకవర్గంలోని గ్రామాలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని విమర్శించారు .నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, స్పోర్ట్స్ స్కూల్, అగ్రికల్చర్, పాలిటెక్నిక్ కాలేజీలు తీసుకురావడానికి కృషి చేస్తున్నాని తెలిపారు. జుక్కల్ నియోజకవర్గాన్ని దేశంలోనే నెం.1 గా నిలుపుతానని చెప్పారు.