షకీల్‌, రిజ్వాన్‌ భారీ శతకాలు

షకీల్‌, రిజ్వాన్‌ భారీ శతకాలురావల్పిండి: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలిటెస్ట్‌లో పాకిస్తాన్‌ జట్టు పట్టు బిగించింది. మిడిలార్డర్‌ బ్యాటర్లు షౌద్‌ షకీల్‌(141), వికెట్‌ కీపర్‌ రిజ్వాన్‌(171నాటౌట్‌) భారీ సెంచరీలతో చెలరేగారు. దీంతో రెండోరోజు పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 113 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 448పరుగులు చేసి డిక్లేర్డ్‌ చేసింది. తొలిరోజు 16పరుగులకే 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పాకిస్తాన్‌ను ఆయుబ్‌, షకీల్‌ కలిసి ఆదుకున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌ బౌలర్లు షోరిఫుల్‌ ఇస్లామ్‌, హసన్‌ మహ్మద్‌కు రెండేసి, మిరాజ్‌, షకీబ్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బంగ్లాదేశ్‌ జట్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా 27పరుగులు చేసింది. షాద్మాన్‌ ఇస్లామ్‌(12), జాకిర్‌ హసన్‌(11) క్రీజ్‌లో ఉన్నారు.