– నాల్గో టెస్టులో ఆధిక్యంలో ఇంగ్లాండ్
మాంచెస్టర్ : ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రావ్లీ (185 బ్యాటింగ్) భారీ శతకంతో చెలరేగాడు. మోయిన్ అలీ (54, 82 బంతుల్లో 7 ఫోర్లు), జో రూట్ (69 బ్యాటింగ్) సైతం అర్థ సెంచరీలతో కదం తొక్కటంతో నాల్గో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులకే కుప్పకూల్చిన ఇంగ్లాండ్.. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా సాగుతోంది. బజ్‌బాల్ దూకుడుతో ఇంగ్లాండ్ బ్యాటర్లు చెలరేగటంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు సుమారు 6 రన్‌రేట్‌తో పరుగులు పిండుకుంది. జాక్ క్రావ్లీ, మోయిన్ అలీ, జో రూట్ మెరుపులతో రెండు సెషన్ల వ్యవధిలోనే ఇంగ్లాండ్ 300 పైచిలుకు పరుగులు సాధించింది. 55 ఓవర్లలో 323/2 పరుగులు చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ముందంజ వేసింది.