నవతెలంగాణ సిరిసిల్ల
మ్యారేజ్ స్పెషల్, దైవ దర్శనాలకు, తీర్థయాత్రలకు, విహారయాత్రలకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సును బుక్ చేసుకున్నట్లయితే 20 శాతం ధరలు తగ్గించడం జరుగుతుందని ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రకాష్ రావు పేర్కొన్నారు. కిలోమీటర్ కు పల్లె వెలుగు బస్సు కు 52 రూపాయలు, ఎక్స్ప్రెస్ కు 62 రూపాయలు, డీలక్స్57 రూపాయలు, సూపర్ లగ్జరీ- 59 రూపాయలు నిర్ణయించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. పల్లె వెలుగు బస్సుల్లో 200 కిలోమీటర్ల కు 12,220 రూపాయలు, 100 కిలోమీటర్ల లోపు పిక్ అండ్ డ్రాప్ 9350 కి నిర్ణయించడం జరిగిందన్నారు. అవకాశాన్ని సిరిసిల్ల పట్టణం, పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని పెళ్లిళ్లకు ఇతర కార్యక్రమాలకు బస్సులను బుక్ చేసుకోవడానికి 6304171291.9959225929 నెంబర్లకు ఫోన్ చేయాలని డిపో మేనేజర్ పేర్కొన్నారు.