నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి రాష్ట్రంలో భారీగా ఈ-చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని క్లియర్ చేసేందుకు ప్రభుత్వం వాహనదారులకు భారీ రాయితీలు ప్రకటిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. టూ, త్రీ వీలర్ వాహనాల చలాన్లపై 80 శాతం రాయితీ ప్రకటించారు. టీఎస్‌ఆర్టీసీ బస్సులకు 90 శాతం, లైట్ మోటార్, హెవీ వెహికల్స్‌కు 60 శాతం పెండింగ్ చలాన్లలో రాయితీ ఇచ్చారు. వాహనదా రులు ట్రాఫిక్ చలాన్లు చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రభుత్వ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు విజ్ఞప్తి చేశారు.