వనదేవతలకు లక్ష 800 రూ. భారీ విరాళాలు

నవతెలంగాణ -తాడ్వాయి
మేడారంలోని సమ్మక్క సారలమ్మ వనదేవతలకు మేడ్చల్ జిల్లా అల్వాల్ మండలంలోని యాప్రాల్ (సికింద్రాబాద్) గ్రామానికి చెందిన ఎనుకొండ లక్ష్మి, ఎనుకొండ చంద్రారెడ్డి లు శనివారం వనదేవతలను దర్శించుకుని ఎండోమెంట్ ఈవో రాజేంద్రం ఆధ్వర్యంలో ఎండోమెంట్ అధికారులు జగదీష్, మధు లకు ఒక లక్ష 800 రూపాయలు భారీ విరాళాలు అందజేశారు. వారికి పూజారుల సంఘం నుండి ఎండోమెంట్ శాఖ నుండి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోరికలు తీర్చే కొంగుబంగారమైన మేడారం సమ్మక్క సారలమ్మ వరదేవతలకు మొక్కులు తీర్చుకునేందుకు వచ్చి విరాళాలు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంగారు ధనుంజయ్, ఎండోమెంట్ సిబ్బంది, విరాళాలు అందించిన వారి బంధువులు, బంధుమిత్రులు ఉన్నారు.