నవతెలంగాణ హైదరాబాద్: హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డ్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున కేపీహెచ్‌బీలోని అర్జున్ థియేటర్ సమీపంలో ఉన్న కంచుకోట టిఫిన్ సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో హోటల్‌లో ఉన్న ఫర్నీచర్ మొత్తం అగ్నికి ఆహుతైంది. హోటల్ వెలుపల ఆపి ఉంచిన రెండు మోటారు సైకిళ్లు కూడా దగ్ధమైంది. భారీగా అగ్నికీలలు ఎగసిపడటంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి.