– శ్రీదత్త విద్యాసంస్థల చైర్మన్ జీ.పాండురంగారెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇంజనీరింగ్ విభాగంలో అపార ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వాటిని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని శ్రీదత్త విద్యాసంస్థల చైర్మన్ జీ.పాండురంగారెడ్డి సూచించారు. మంగళవారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ శేరిగూడలో ఉన్న శ్రీదత్త విద్యాసంస్థలలో క్యాప్ జెమిని, ఎక్స్సిడియస్, ఏఐఎంఎల్, ఏఐ టెక్నాలజీస్, 3జి హెచ్‌ఆర్ సర్వీసెస్ వంటి బహుళ జాతీయ సంస్ధల అధ్వర్యంలో ప్రాంగణ నియామకాలు చేపట్టారు. ఈ జాబ్ మేళాలో శ్రీదత్త విద్యాసంస్థల చైర్మన్ పాండురంగారెడ్డి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థుల వద్దకే వచ్చి ప్రముఖ సంస్థలు, కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం గొప్ప అవకాశమని, దానిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎంతో కష్టపడి చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభించినప్పుడే విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరింత గౌరవం, తప్తి కలుగుతుందని అన్నారు. చదువు పూర్తయిన అనంతరం ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరిగే అవసరం లేకుండా కళాశాలల్లోనే జాబ్ మేళాలు నిర్వహించి పలు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. విద్యార్థులు విద్యతో పాటు వత్తి నైపుణ్యాలను అభివద్ధి చేసుకోవాలని తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ చివరి విద్యార్థులకు ఇదే విధంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. విద్యార్థులకు తాము అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు. అనంతరం జాబ్ మేళాకు వచ్చిన వివిధ సంస్థల ప్రతినిధులు విద్యార్థులతో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించి ఇంటర్వ్యూలు చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ విభవ్ రెడ్డి, డీన్ అకాడమిక్స్ డాక్టర్ అచ్చుతరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు, డాక్టర్ సెంథిల్ కుమార్, నాగరాజు, శ్రీనివాస్ వర్మ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.