న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల వేదిక పేటియం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ భారీ నష్టాలు చవి చూసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో సంస్థ నికర నష్టాలు రెట్టింపు పైగా పెరిగి రూ.840 కోట్లకు ఎగిశాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.338 కోట్ల నష్టాలు నమోదు చేసింది. ఇదే సమయంలో కంపెనీ రెవెన్యూ రూ.2,342 కోట్లుగా ఉండగా.. గడిచిన క్యూ1లో 36 శాతం క్షీణించి రూ.1,502 కోట్లకు తగ్గింది. తమ ఆదాయం, నిర్వహణ లాభాలు అంచనాలకు అనుగుణంగానే ఉందని కంపెనీ తెలిపింది. రెండో త్రైమాసికంలో ఇది మరింత మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.