ఎన్టీఆర్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘దేవర’. కొరటాల శివ దర్శకుడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ కీ రోల్ చేస్తున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో చిత్రాన్ని అత్యంత భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకు ఇప్పుడు బాలీవుడ్ నుంచి అద్భుతమైన సపోర్ట్ లభించింది. బాలీవుడ్ మేజర్ ప్లేయర్స్ ధర్మ ప్రొడక్షన్స్, ఏఏ ఫిల్స్ కలిసి ఈ సినిమాను ఉత్తరాదిన డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. దేవర నార్త్ థియేట్రికల్ రైట్స్‌ని కరణ్ జోహార్, అనిల్ తండానీ సొంతం చేసుకున్నారు. అత్యంత భారీ మొత్తం చెల్లించి ఈ మాగమ్ ఆపస్‌ని దక్కించుకున్నారు. ఎన్టీఆర్‌కి ఉత్తరాదిన ఉన్న స్టార్‌డమ్‌కి, కరణ్ జోహార్, అనిల్ తండానీ పేర్లు యాడ్ కావడంతో నెక్ట్స్ లెవల్ బజ్ క్రియేటైంది. ఉత్తరాది మార్కెట్ నుంచి అనూహ్యమైన కలెక్షన్లు గ్యారంటీ అనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఇండియన్ సినిమాలో మైల్‌స్టోన్ మార్క్ దేవర క్రియేట్ చేస్తుందనే నమ్మకం మరోసారి కనిపిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో అద్భుతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్ రామ్ సమర్పిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికష్ణ.కె. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.