భారీ స్థాయిలో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌

Huge pre-release businessరామ్‌ చరణ్‌, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. సినిమా రిలీజ్‌ సందర్భంగా భారీ స్థాయిలో జరుగుతున్న ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ అందర్నీ సర్‌ప్రైజ్‌ చేస్తోంది. ఈ సినిమా నార్త్‌ ఇండియా డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ ఫ్యాన్సీ మొత్తానికి అమ్ముడయ్యాయి. ఇది రామ్‌ చరణ్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌. ఈ మూవీని నార్త్‌లో అనిల్‌ తడాని తమ ‘ఏ’ ఫిల్మ్స్‌ ద్వారా రిలీజ్‌ చేయబోతున్నారు. ఉత్తర భారతదేశ పంపిణీ హక్కులను ఆయన భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. అలాగే నార్త్‌లో ఈ చిత్రాన్ని ఎక్కువ థియేటర్లలో రిలీజ్‌ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘జరగండి’, ‘రా రా మచ్చ’ పాటలు సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇందులో రామ్‌ చరణ్‌ హానెస్ట్‌ ఐఏఎస్‌ అధికారిగా, అణగారిన వర్గాల సంక్షేమం కోసం పోరాడే రాజకీయ నాయకుడిగా కనిపించబోతోన్నారు. బాలీవుడ్‌ నటి కియారా అద్వానీ కథానాయికగా, తెలుగు నటి అంజలి కీలక పాత్రలో నటిస్తున్నారు.