– తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్నపరిమల్
నవతెలంగాణ-తాండూరు
తాండూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం వధశాల(మేకలు, గొర్రెలు), బీఫ్ కు మున్సిపల్ వధశాల (మేకలు, గొర్రెలు), బీఫ్ వేరువేరుగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మున్సిపల్ కార్యాలయంలో బహిరంగ వేలం వేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ తాటి కొండ స్వప్న పరిమళ్, కమిషనర్ విక్రమ్ సింహారెడ్డిల సమక్షంలో వధశాలకు, బీఫ్‌కు వేలం వేరు వేరుగా నిర్వహించారు. వధశాల కు ఎండీ మాజీద్ అనే వ్యక్తి రూ.46 వేలు పాడి దక్కించుకున్నారు. బీఫ్‌కు అబ్దుల్ ఖయ్యూం ఖురేషీ అనే వ్యక్తి రూ. 50వేలు పాడి దక్కించుకున్నారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడు తూ.. బహిరంగ వేలంలో మున్సిపల్‌కు ఆదాయం రావడం సంతోషంగా ఉం దన్నారు. ఇటీవలే బహిరంగ వేలం ద్వా రా రూ.30లక్షలు 65వేలు ఆదాయం వచ్చిందన్నారు. అదేవిధంగా వధశాల కు రూ. 45వేలు, బీఫ్‌కు రూ. 50వేలు రావడంతో ఈ డబ్బును అభివృద్ధికి ఉపయోగిస్తామన్నారు. కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి మాట్లాడుతూ.. వేలం దక్కించుకున్న అర్హులు ఏడు రోజు ల్లో వేలం డబ్బులు చెల్లించాలని సూచించారు. ఎటు వంటి కారణాలు చూపకుండానే బహిరంగ వేలంను వాయిదా వేయుటకు లేదా రద్దు చేయుటకుగాను తమకు పూర్తి హక్కులు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.