– జింబాబ్వేపై 232పరుగుల తేడాతో గెలుపు
హరారే: ఆఫ్ఘనిస్తాన్ జట్టు వన్డేల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఏకంగా 232పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో 287పరుగులు చేయగా.. ఆ తర్వాత జింబాబ్వేను 17.5ఓవర్లలో 54పరుగులకే ఆలౌట్ చేసింది. ఆఫ్ఘన్ బౌలర్ నవీద్ మూడు వికెట్లతో జింబాబ్వేను కట్టడి చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు సెద్ధికుల్లా(104) సెంచరీకి తోడు అబ్దుల్ మాలిక్(84) అర్ధసెంచరీలతో రాణించి తొలి వికెట్‌కు 191పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత 37పరుగుల వ్యత్యాసంలో వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో కెప్టెన్ షాహిది(29నాటౌట్) రాణించడంతో ఆ జట్టు 6వికెట్ల నష్టానికి 286పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లతో నెవాన్‌కు మూడు, ట్రేవియర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఆఫ్ఘన్ బౌలర్లు నవీద్(3/13), ఘజన్‌ఫర్(3/8)కి తోడు ఫారూఖీ(2/15) బౌలింగ్‌లో చెలరేగారు. జింబాబ్వే బ్యాటర్లతో విలియమ్సన్(16), సికిందర్ రాజా(19) మాత్రమే రెండంకెల స్కోర్ కొట్టారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 1-0 ఆధిక్యతలో నిలువగా.. రెండో వన్డే శనివారం జరగనుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ షదీఖుల్లాకు దక్కింది.