రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ తొలిసారి కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ‘జైలర్’. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొం దుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ ‘హుకుం’ పాటని మేకర్స్ ఆదివారం విడుదల చేయగా, తెలుగు వెర్షన్ పాటను అగ్ర కథానాయకుడు వెంకటేష్ లాంచ్ చేశారు.
‘ప్రేక్షకులను ప్రతిసారి అలరించే అనిరుధ్ ‘హుకుం ‘పాట కోసం థంపింగ్ ట్యూన్ చేశారు. బీట్‌లు వోకల్స్ హైలీ ఎనర్జిటిక్‌గా ఉన్నాయి. ఈ పాటకు భాస్కరభట్ల చక్కని సాహిత్యం అందించారు. రజనీకాంత్ పూర్తి మాస్ అవతార్‌లో తుపాకులు పేల్చుతూ కనిపించారు. రజనీకాంత్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్,స్వాగ్, డైలాగ్ డెలివరీ ఖచ్చితంగా అభిమానులను ఉర్రూతలూగిస్తాయి.
‘కావాలయ్య..’ పాట ఇప్పటికే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ‘హుకుం’ పాట కూడా ఇన్‌స్టంట్ హిట్ అయ్యింది. బిగ్ స్క్రీన్స్‌పై పూర్తి విజువల్స్‌తో పాటను చూసినప్పుడు కచ్చితంగా డబుల్ ఇంపాక్ట్‌ని ఇస్తుంది.
ఈ సినిమా ఆగస్ట్ 10న విడుదల కానుంది. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తోంది’ అని చిత్ర బృందం తెలిపింది. జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, సునీల్, రమ్యకష్ణ, వినాయకన్, మర్నా మీనన్ కీలక పాత్రలు పోషిస్తుండగా, మోహన్‌లాల్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. విజరు కార్తీక్ కన్నన్ కెమరామెన్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి ఆర్ నిర్మల్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.