నవతెలంగాణ-జహీరాబాద్
సమాజంలో అన్నిటికంటే మానవ ప్రాణం చాలా విలువలతో కూడుకున్నదని జైన్ మత గురువు సాధ్వి ప్రజ్ఞా జీ అన్నారు. చిరాక్‌పల్లిలోని ఆర్టిఏ చెక్‌పోస్ట్ వద్ద శనివారం ఏర్పాటు చేసిన రోడ్డు వారోత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని డ్రైవర్లకు, ప్రయాణికులకు, ఆర్టిఏ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలను పాటిస్తే.. ప్రమాదాలు జరగవన్నారు. వర్షాలు కురుస్తున్నప్పుడు, పొగ మంచ ులో వాహనాలు నడపకూడదని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తే 90 శాతం రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ఎంతోమంది యువకులు తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారన్నారు. కాబట్టి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఏ జీవీఎస్ గౌడ్, సిబ్బంది, డ్రైవర్లు పాల్గొన్నారు.