మానవ సహజం

సాటి మనిషిని నేలకి పడదోయాలనుకుంటారు
చచ్చాక పల్లకీ ఎక్కి ఊరేగిస్తారు.
మానవ (నిజ) నైజం సహజంలా అయింది

ప్రమాదాన్ని ఎదిరిస్తే
తెగించడం
సమాజాన్ని ఎదిరిస్తే
బరితెగింపు!

సమస్య కంటే
సమాజానికి
భయపడేవాళ్లే ఎక్కువ!

సంఘర్షణ లేని జీవితం
సముద్రంలో శవంతో సమానం.

సుఖం మంచు తెరలాంటిది
అనుభవించేలోగా కరిగిపోతుంది.
దు:ఖం గాయంలాంటిది
మానిపోయినా ‘మచ్ఛ’ మిగిలిపోతుంది.!

– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి, 8008577834